'లైగర్'లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఎ) ఛాంపియన్‌గా విజయ్ దేవరకొండ కనిపించారు. విజయ్ దేవరకొండ కంటే ముందు ఎవరు ఎవరు బాక్సింగ్, ఈ తరహా రోల్స్ చేశారో చూడండి. 'తమ్ముడు' సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సర్ రోల్ చేశారు. 'గురు' సినిమాలో విక్టరీ వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా, గతంలో ఫేమస్ బాక్సర్ గా మంచి రోల్ చేశారు. 'జానీ'లో క్లబ్ ఫైటర్ నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా కోచ్ గా ఎదిగే పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. బాక్సింగ్ అంటే పూరి జగన్నాథ్ తీసిన 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' గుర్తు వస్తుంది. అందులో రవితేజ బాక్సర్. 'జై' సినిమాలో నవదీప్ కూడా బాక్సర్. ఇటీవల వచ్చిన 'గని' సినిమాలోనూ వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించారు. తైక్వాండో నేపథ్యంలో 'భద్రాచలం' సినిమా రూపొందింది. అందులో శ్రీహరి హీరో.