దసరా స్సెషల్ విజయవాడ ఉత్సవ్ సెప్టెం బర్ 22న పున్నమి ఘాట్‌లో ఘనంగా ప్రారంభమైంది. వెంకయ్యనాయుడు ప్రారంభించారు.



పున్నమి ఘాట్, గొల్లపూడి, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాలలో వివిధ కార్యక్రమాలు. కృష్ణా నది ఒడ్డున ప్రదర్శనలు జరుగుతున్నాయి.



సంప్రదాయ కళారూపాలు, నృత్య ప్రదర్శనలు, సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్స్. కూడా ఉంటాయి.



విజయవాడ మారథాన్, మెగా యోగా సెషన్‌లు, హస్తకళల ఫోటీలను కూడా నిర్వహిస్తున్నారు.



అగ్ని అవార్డులు, సోషల్ మీడియా అవార్డులు ప్రదానం. స్థానిక కళాకారులు, టాలెంటెడ్ వ్యక్తులకు ఈ అవార్డులు ఇస్తున్నారు.



10-15 లక్షల మంది కనకదుర్గమ్మ భక్తులు వచ్చిన సమయంలో, ఉత్సవం వారిని 2-3 రోజులు ఉంచి సంస్కృతి, చారిత్రక ఆకర్షణలను అందిస్తున్నారు.



ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు.



కృష్ణా నదిపై పడవల పోటీలు. ఈ ఈవెంట్ నది ఒడ్డున ఉన్న విజయవాడ సౌందర్యాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.



చివరి రోజు (అక్టోబర్ 2) ప్రత్యేక డ్రోన్ షో. ఆకాశంలో విజయవాడ అందాలు చిత్రరూపంగా చూపిస్తారు.



విజయవాడలో 12 ఏళ్ల తర్వాత ఎగ్జిబిషన్‌తో కూడిన ఈ ఉత్సవం ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఊపును తెస్తోంది.