తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి బాలీవుడ్‌కు మరో భారీ ఆఫర్ అడుగు దూరంలో ఉందట. ఇటీవలే ‘జవాన్’, ‘మెర్రీ క్రిస్మస్’ సినిమాలతో విజయ్ సేతుపతి బాలీవుడ్‌ను పలకరించాడు. బాలీవుడ్ ప్రస్తుతం టాక్స్‌లో ఉన్న క్రేజీ ప్రాజెక్టు ‘రామాయణం’. ఈ సినిమాలో విభీషణుడి పాత్రకు విజయ్ సేతుపతిని మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం బాల్ విజయ్ సేతుపతి కోర్టులోనే ఉంది. విజయ్ సేతుపతి ఓకే అంటే సౌత్ ఇండియా స్టార్ కూడా ఈ సినిమాలో యాడ్ అయినట్లు అవుతంది. ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నాడు. సీత పాత్ర సాయి పల్లవిని వరించినట్లు సమాచారం. రావణుడి పాత్రలో కేజీయఫ్ స్టార్ యష్ కనిపించనున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఓకే అయితే రణ్‌బీర్‌తో విజయ్ సేతుపతి నటించే మొదటి సినిమా ఇదే అవుతుంది.