విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన సినిమా ‘మెర్రీ క్రిస్మస్’ విడుదల అయింది. అనుకోకుండా క్రిస్మస్ ముందు రోజు రాత్రి కలిసిన ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి), మరియా (కత్రినా కైఫ్) కథే ఈ సినిమా. ఆరోజు రాత్రి వారి జీవితాల్లో ఏం జరిగింది? ఎన్ని మలుపులు తిరిగాయి? అన్నదాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. ప్రేక్షకుల ఊహలకు, అంచనాలకు ఏమాత్రం అందకుండా కథను నడపటం శ్రీరామ్ రాఘవన్ స్పెషాలిటీ. సినిమా ప్రారంభం నుంచి కథ నడిచే తీరు, పాత్రల ప్రవర్తన ప్రేక్షకుడి ఆలోచనని ఒకవైపు తీసుకెళ్తుంది. కానీ స్క్రీన్‌పై జరిగే కథ మాత్రం చాలా వేరుగా ఉంటుంది. ఫస్టాఫ్‌లో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌ల కెమిస్ట్రీ మీదనే సాగుతుంది. అసలు కథ ఇంటర్వల్ నుంచి ప్రారంభం అవుతుంది. సెకండాఫ్ మాత్రం చాలా గ్రిప్పింగ్‌గా సాగుతుంది. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌ల నటన ఆకట్టుకుంటుంది. ఏబీపీ దేశం రేటింగ్: 3/5