విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ‘లైగర్’కు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. జులై 21న ‘లైగర్’ ట్రైలర్ విడుదలైంది. తెలుగు ట్రైలర్‌ను చిరంజీవి, హిందీ ట్రైలర్‌ను రణ్‌వీర్ రిలీజ్ చేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ‘లైగర్’ విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ప్రత్యేక ఆకర్షణ. విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే కథానాయికగా నటించింది. ట్రైలర్ విడుదల నేపథ్యంలో విజయ్ ఫ్యాన్స్ అతడిని రోడ్డుపై గజమాలతో సత్కరించారు. ఆ గజమాలను ఎత్తేందుకు క్రేన్‌ను ఉపయోగించడం గమనార్హం. ‘లైగర్’కు పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు. Images & Videos: Charmmekaur and Puri Connects/Instagram