ఐదు పదుల వయసుకి దగ్గరపడుతున్నా.. ఇప్పటికీ తన ఫిట్నెస్ తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటుంది మలైకా. సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది ఈ బ్యూటీ. తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ తరచూ ట్రిప్ లకు, రెస్టారెంట్ లకు వెళ్తూ మీడియా కంట పడుతుంటారు. ఇదిలా ఉండగా.. తాజాగా మలైకా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో మలైకా ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆమె లుక్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. డ్రెస్సింగ్ విషయంలో మలైకాను ఎవరూ బీట్ చేయలేరంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.