అందాల మెహ్రీన్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత ఇష్టమో తెలిసిందే. ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ నుంచి ‘F3’ వరకు బోలెడంత వినోదాన్ని పంచింది. ‘ఎఫ్2’లో హనీ ఈజ్ బెస్ట్ అంటూ మెహ్రీన్ గుర్తుండిపోయే పాత్ర చేసింది. ‘మహానుభావుడు’ సినిమాలో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చంపేసింది. ఒకప్పుడు బొద్దుగా అందంగా ఉండే మెహ్రీన్ ఇప్పుడు బాగా సన్నబడింది. మెహ్రీన్ చేతిలో ఒక తెలుగు, ఒక కన్నడ చిత్రం ఉన్నాయి. ప్రస్తుతం మెహ్రీన్ తన తమ్ముడు గుర్ఫతేతో విదేశాల్లో విహరిస్తోంది. మెహ్రీన్ గుర్ఫతే కూడా నటుడే. అతడు పంజాబీ, హిందీ చిత్రాల్లో నటిస్తున్నాడు. అతడిని చూడగానే ‘ఇతడేంటీ ఇలా ఉన్నాడు’ అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. అతడిది హీరోలను మించిన కటౌట్ మరి. చూస్తుంటే.. మెహ్రీన్ తన తమ్ముడిని కూడా టాలీవుడ్‌కు పరిచయం చేసేలా ఉంది. Image Credit: Mehreen Pirzada/Instagram