హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ ట్రయల్ రన్ ప్రారంభమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫార్ములా-E రేసు హైదరాబాద్ లో జరగనుంది 6 బృందాలుగా మొత్తం 24 మంది రేసర్లు ఈ రేసింగ్ పాల్గొంటున్నారు. ఈ రేసింగ్ లో సగం మంది మన దేశం, సగం మంది విదేశాలకు చెందినవారు ఐమాక్స్ నుంచి ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్ , ఐమ్యాక్స్ వరకూ రేస్ సర్య్కూట్ ఈ రేసింగ్ లీగ్ లో 250 కిలోమీటర్ల వేగంతో రేసింగ్ కార్లు దూసుకుపోతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ రేసింగ్ కు HMDA పూర్తి ఏర్పాట్లు చేసింది. రేసింగ్ లీగ్ కోసం 2.7 KM స్ట్రీట్ సర్క్యూట్ ఏర్పాటు చేసింది. RPPL సంస్థ నిర్వహిస్తుంది ఎలక్ట్రిక్ రేసింగ్ కార్లు గంటకు 280 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలవు.