తక్కువ పొటాషియంతో కిడ్నీఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాయగూరల్లో కాలీఫ్లవర్ ముందుంటుంది.

విటమిన్లు ఎ, సి, బి6 కలిగిన ఎర్రని సిమ్లా మిర్చి కిడ్ని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

క్యాబేజి మంచి పోషకాహారం. తక్కువ పొటాషియం, ఎక్కువ ఫైబర్ కలిగిన ఈ కాయగూరతో కిడ్నీలకు మంచిది.

వెల్లుల్లితో కిడ్నీ పనితీరు మెరుగవుతుంది.

ఆలీవ్ ఆయిల్ లో మోనోసాచూరేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండెకు నేరుగా మేలుచేస్తే కిడ్నీలకు పరోక్షంగా మేలు చేస్తాయి.

సమతుల అమైనో ఆసిడ్లు కలిగి తక్కువ పొటాషియంతో క్వినోవా ప్రొటిన్ కలిగిన ధ్యాన్యం. ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్ కిడ్నీ ఆరోగ్యానికి అవసరం.

ఎర్రని ఉల్లిగడ్డల్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. యాంటీఇన్ఫ్లమ్లేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కిడ్నీ ఆరోగ్యానికి అవసరం.

ఆపిల్స్ లో పొటాషియం తక్కువ. ఫైబర్ ఎక్కువ. దీన్ని కిడ్నీ ఫ్రెండ్లీ ఫ్రూట్ గా చెప్పుకోవచ్చు.
Images courtesy : Pexels and Unsplash