నెగెటివ్ ఎనర్జీ నుంచి కాపాడుకునేందుకు వీలైనంత వరకు పడమర, దక్షిణ ముఖంగా ఉన్న ఇల్లు ఎంచుకోవద్దు.

వంటగది తప్పనిసరిగా ఆగ్నేయంలో ఉండేలా జాగ్రత్త పడాలి. గదిలో ఆగ్నేయంలోనే స్టవ్ అమర్చుకోవాలి.

ఫ్రిజ్ వాయవ్యంలో అమర్చుకుంటే ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది.

మాస్టర్ బెడ్ రూమ్ ఎప్పుడైనా నైరుతిలో ఉండేట్టు చూసుకోవాలి. తూర్పు లేదా పడమర దిక్కులుగా బెడ్ అమర్చుకోవాలి.

బాత్రూమ్ లు వాయవ్య దిక్కులో ఉంటే మంచిది. వీలైనంత వరకు మంచి వెంటిలేషన్ తో ఉంటే మంచిది.

ఇంట్లోకి సహజమైన కాంతి ప్రసరించే ఏర్పాటు ఉండాలి. కిటికీలు పడమర, ఉత్తరం వైపు ఉంటే మంచి గాలి వెలుతురు ఇంట్లోకి వస్తాయి.

ఇంట్లో గోడలకు వీలైనంత వరకు లేత రంగులను ఎంచుకుంటే మరింత వెలిగిపోతున్నట్టు కనిపిస్తుంది.

ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలనుకుంటే అవి తూర్పు లేదా ఉత్తరంలో పెట్టుకోవడం మంచిది.

ఫౌంటైన్ల వంటి నీటి అలంకరణలు ఈశాన్యంలో పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.