వాస్తును అనుసరించి కారులో కొన్ని వస్తువులు పెట్టుకోవడం శుభప్రదం అని శాస్త్రం చెబుతోంది. కారులో కేతువుకు సంబంధించిన వినాయకుడి చిన్న విగ్రహం పెట్టుకోవాలి. అడ్డంకులు తొలగిస్తాడని నమ్మకం కారులో హనుమంతుడి విగ్రహం పెట్టుకోవడం కూడా శుభప్రదం. కార్లో చైనీస్ నాణేలు వేలాడదీస్తే చాలా మంచిదట. ఇవి ప్రతికూలతలను తొలగిస్తాయట. గళ్లఉప్పు, బేకింగ్ సోడాను కలిపి పొట్లంగా కట్టి కార్ సీట్ కింద ఉంచాలి. రోజూ కొత్త పొట్లంలో కట్టి పెట్టుకుంటూ ఉండాలి. వాస్తు ప్రకారం ఉప్పు కారులో ఉండే ప్రతికూల శక్తిని గ్రహిస్తుందని నమ్మకం. కార్లో ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవాలి. జలతత్వం ఆలోచనల్లో స్పష్టతను, సౌభాగ్యాన్ని ఇస్తుంది. కార్ డాష్ బోర్డులో క్రిస్టల్స్ పెట్టుకుంటే శుభప్రదం. ఇవి భూ సంబంధమైనవి కనుక వాహనం సురక్షితంగా ఉంటుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!