మీ ఇల్లు ఇలా సర్దుకున్నారా - అయితే చాలా అదృష్టవంతులు
వాస్తును అనుసరించి ఇల్లు, ఇంట్లోని వస్తువులు ఉండడం వల్ల ఇల్లు అందంగా ఉండటమే కాదు.. అదృష్టం కూడా లభిస్తుంది. ఎప్పుడైతే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందో.. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది.
ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తికం, ఓం వంటి చిహ్నాలు లేదా దేవతా మూర్తులను చిత్రించుకోవచ్చు. వాకిలి అందంగా ఉంటేనే ఇంటికి శోభ.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద టోరన్లు లేదా పువ్వులతో అలంకరించుకోవడం ప్రతీతి. టోరాన్ల శబ్ధం నెగెటివ్ ఎనర్జీని ఇంట్లోకి రానివ్వవు. అందంగా కూడా ఉంటాయి.
ప్రధాన గుమ్మం దగ్గర నీటి తొట్టి లేదా ఫ్లోటింగ్ ప్లవర్స్ అరేంజ్మెంట్ కూడా అందంగా ఉండడమే కాదు. ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. కుటుంబ శ్రేయస్సుకు ఇదొక మంచి టిప్.
హాల్ లేదా లివింగ్ రూమ్ ఎప్పుడూ బిజీగా ఉండే చోటు. అందువల్ల దీని అలంకరణ గురించి కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. లివింగ్ రూం లో అందమైన పెయింటింగ్స్ పెట్టాలి
ప్రవహించే నదులు, వాటర్ ఫాల్స్ వంటి చిత్రాలను కూడా గోడల మీద అలంకరించవచ్చు. ఇవి కూడా ఇంట్లోకి జీవశక్తిని ఆహ్వానిస్తాయి. భయం కొలిపే చిత్రాలు, కృరమృగాల వంటి చిత్రాలు ఇంట్లో అలంకరణకు పనికి రావు.
మొక్కలు జీవశక్తికి ప్రతీకలు. ఇంటి ఆవరణలో, ఇంటి లోపల కూడా మొక్కులు పెట్టుకోవడం వల్ల పరిసరాలలో పాజిటివిటి పెరుగుతుంది. మనీ ప్లాంట్, లక్కీ బాంబూ, తులసి, కలబంద వంటివి ఇంట్లో పెంచుకోవడం చాలా బావుంటుంది.
కలబంద, మనీ ప్లాంట్ వంటివి లివింగ్ రూమ్ కి ప్రత్యేక శోభనిస్తాయి. కాక్టస్ వంటి ముళ్ల మొక్కలు ఇంటిలోపల పెట్టుకోవడం అంత మంచిది కాదు.
కుటుంబంలో అందరూ కలిసి గడిపే మరో ప్రాంతం డైనింగ్. ఇక్కడి వాస్తునియమాలను కచ్చితంగా అనుసరించాలి. బాగా గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. వీలైనంత ప్రశాంతంగా ఇంట్లో ఈ భాగం ఉండాలి.
బెడ్ రూమ్ విశ్రాంతికి అనువుగా ఉంచుకోవాల్సిన ప్రదేశం. బెడ్ రూమ్ లో టీవీలు, ఇతర గాడ్జెట్స్ ఉంచకూడదు. డ్రెస్సింగ్ టేబుల్, వార్డ్ రోబ్స్ కచ్చితంగా బెడ్ రూమ్ లోనే ఉంటాయి కనుక వీటికి అమర్చిన అద్దాలలో బెడ్ ప్రతిబింబం కనిపించకుండా జాగ్రత్త పడాలి.