ఇంట్లో వస్తువులు శుభ్రంగా, క్రమబద్ధంగా అమర్చుకోవాలి. అస్తవ్యస్తమైన ఇల్లు నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. శాంతికి భంగం కలిగిస్తుంది. ఈశాన్య ముఖద్వారం ఉండే ఇల్లు అదృష్టాన్నిస్తుంది. ఇంట్లో సామరస్యం నెలకొంటుంది. ఇంట్లో ఆనందకరమైన కుటంబం లేదా ఆహ్లాదకరమైన చిత్రాలను అలంకరించుకోవాలి. ఇంట్లోకి వెంటిలేషన్ ధారాళంగా ఉండేట్టు జాగ్రత్త పడాలి. సూర్య కాంతి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది. పగుళ్లు కలిగిన గోడలు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం మీద ప్రభావం చూపుతాయి. కనుక వెంటనే వాటిని బాగుచేయించాలి. నెలకు ఒక్కసారైనా హవన పూజ ఇంట్లో జరిపిస్తే ఇంట్లో ఎనర్జీ బ్యాలెన్స్ డ్ గా ఉంటుంది. డ్రాయింగ్ రూమ్ లో బుద్ధ విగ్రహం లేదా పేయింటింగ్ తో అలంకరించుకోవాలి. బుద్దుడు శాంతి, సామరస్యానికి ప్రతీక. Representational Image : Pexels