తరచుగా జీర్ణ సమస్యలు వేధిస్తుంటే లివర్ లో ఏదో సమస్య మొదలైందనేందకు సంకేతం కావచ్చు. పొట్టలో ఎల్లప్పుడు భారంగా ఉంటే లోపలి అవయవాల్లో ఏదో సమస్య మొదలైందని అర్థం. పొట్టలో లివర్ వైపున భారంగా ఉంటే కొవ్వులు తగ్గించి తీసుకోవాలి. అయినా తగ్గకపోతే డాక్టర్ ను సంప్రదించాలి. పొత్తి కడుపు పై భాగంలో నొప్పి ఉండి అది కుడి భుజం వరకు సాగితే క్యాన్సర్ కూడా కావచ్చు. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. కుడి వైపు థోరాసిక్ కావెటిలో భారంగా ఉండి, ఏదో ఉన్నట్టు అనిపిస్తే లివర్ లో ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు. ఇది క్యాన్సర్ వల్ల కూడా కావచ్చు. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరం. కారణం లేకుండా అలసటగా అనిపిస్తుంటే లివర్ పనితీరు బాలేదని అనుమానించాలి. పోషకాల శోషణలో ఆటంకం కలిగి నీరసం వస్తుంది. ఆకలి మందగించేందుకు రకరకాల కారణాలు ఉండవచ్చు. దీర్ఘకాలికంగా వేధిస్తుంటే హెపటైటిస్, సిర్రోసిస్, లేదా లివర్ క్యాన్సర్ ఏదైనా కావచ్చు. రక్తం, ఇతర కణజాలాల్లో పిత్తరసం చేరడం వల్ల చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. ఇది కామెర్లకు సంకేతం. తరచుగా కామెర్ల బారిన పడుతుంటే మాత్రం హెపటైటిస్ కావచ్చు. లేదా గిల్బర్ట్ సిండ్రోమ్ కూడా కావచ్చు. Representational Image : Pexels