జామపండులో విటమిన్లు, ఖనిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లతో పవర్ హౌజ్ వంటివి. జామ పండ్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మంలో కొల్లజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. జామలో చక్కెరలు తక్కువ కనుక క్యాలరీ ఇన్ టేక్ తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. జామ పండులోని ఫైబర వల్ల కొలన్ క్యాన్సర్, హెమరాయిడ్స్ ముప్పు తప్పుతుంది. జామ పండు తరచుగా తీసుకుంటే వీటిలోని లైకోపిన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా క్యాన్సర్ నివారించబడుతుంది. జామ ఆకు రసం స్పాస్మోలిటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. కనుక నెలసరి నొప్పికి చాలా మంచి ఔషధం. జామ ఆకులలో పొటాషియం, ఫైబర్, పాలీశాకరైడ్లు ఉంటాయి. ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. జామ ఆకును టీగా తీసుకోవచ్చు. అథెరోస్క్లీరోసిస్ ను నివారిస్తుంది. Representational Image : Pexels