వాస్తు: ఈ మొక్కలు ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదు



వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు ఇంటిలోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. కొన్ని మొక్కలు నెగిటివ్ ఎనర్జీకి స్వాగతం పలుకుతాయి. అలాంటి మొక్కలు వెంటనే తీసేయాలి



జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం, కాక్టస్ (బ్ర‌హ్మ‌జెముడు జాతి) మొక్కను ఇంట్లో ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, కాక్టస్ మొక్క ఇంట్లో ప్రతికూల శక్తిని తెస్తుంది.



ఆకులపై ఉన్న పదునైన ముళ్ళు ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయని నమ్ముతారు. కాక్టస్ మొక్క ఇంట్లో దురదృష్టాన్ని తెస్తుంది. ఇది కుటుంబంలో ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది.



ఇంట్లో పత్తి మొక్కను పెంచ‌డం వాస్తు శాస్త్రంలో అశుభం. పత్తి మొక్కను ఇంటి లోపల నాటడం దురదృష్టాన్ని తెస్తుంది.



వాస్తు శాస్త్రం ప్రకారం, పత్తి మొక్కలు మీ పురోగతికి ఆటంకం కలిగిస్తాయి, మిమ్మల్ని ఇబ్బందుల్లో పడవేస్తాయి.



ఇంట్లో బోన్సాయ్ మొక్కలు నాటడం వాస్తు శాస్త్రంలో స్పష్టంగా నిషేధించారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మొక్కలను ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి



కెరీర్ లేదా వ్యాపారంలో ఎదురుదెబ్బకు దారితీయవచ్చు. కాబట్టి, ఈ మొక్కను మీ ఇంటి లోపల ఉంచ‌కూడదు.



గోరింటాకు మొక్కలను ఇంట్లో పెట్టుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం దుష్టశక్తులు ఈ మొక్కలలో నివసిస్తాయి.



ఈ మొక్కల వాసన ఇంటి మొత్తం వాతావరణాన్ని పాడు చేస్తుంది. మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే వీలైనంత త్వరగా వాటిని తొలగించండి.



చింత మొక్కలు ఇంటి లోపల ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి కాబట్టి వాటిని ఇంటి చుట్టూ లేదా లోపల నాటకూడదు



ఇంట్లో నిత్యం భయాందోళనలు నెలకొంటాయి. అందువల్ల, ఈ మొక్కను వెంటనే ఇంట్లో నుంచి తొలగించాలి. (Images Credit/Pixabay)