2023 డిసెంబర్ 23 ముక్కోటి ఏకాదశి



2023లో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిలు రెండొచ్చాయి



ఏడాది ఆరంభంలో జనవరి 2 సోమవారం రోజు ముక్కోటి ఏకాదశి వచ్చింది



మళ్లీ ఇదే ఏడాది డిసెంబరు 23 శనివారం ముక్కోటి ఏకాదశి వచ్చింది



మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి/ వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి అంటారు



సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి ఇది



ఈ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు



ఈ రోజు స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సమస్త కోర్కెలు తీర్చే, పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని పండితచులు చెబుతారు



అందుకే ముక్కోటి ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు



శ్రీ మహా విష్ణువు మూడుకోట్ల మంది దేవతలతో కలసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిచ్చే రోజుది...అందుకే ముక్కోటి ఏకాదశి అంటారు
Images Credit: Pinterest