చాణక్య నీతి: సుపరిపాలనకు గూఢచార వ్యవస్థ ఇలా ఉండాలి



పరిపాలనా వ్యవస్థలో గూఢచారి వ్యవస్థకు చాలా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు చాణక్యుడు



వారిచ్చే సమాచారం ఆధారంగా ప్రభువు తన పరిపాలనా విధానంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని సూచించాడు



చాణక్యుడు చెప్పిన గూఢచారుల్లో రకాలు
1. కాపాటిక 2. ఉదాస్థిత 3.గృహపాటిక 4.వైదిహిక 5.తాపస



కాపాటిక
మంచి వక్తగా, విద్యాలయంలో విద్యార్థిగా ఉన్నట్టు అందర్నీ నమ్మిస్తాడు. తాను తెలుసుకుని చెప్పాల్సిన విషయాలు ప్రభువుకి చేరవేస్తారు



ఉదాస్థిత
ఎప్పుడూ ఏకాంతంగా ఉండే సన్యాసులుగా ఉంటారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా రాజ్యంలో ఉండే సమస్యలు, ప్రజల అభిప్రాయాలు సేకరించి రాజుకి చేరవేస్తారు.



గృహపాటిక
బీదరైతుగా ఉంటూ కావాల్సిన సమాచారం సేకరిస్తారు



వైదేహిక
ఇంటింటికీ తిరుగుతూ వస్తువులు విక్రయించే బీద వ్యాపారిగా ప్రజల మధ్య ఉంటూ అభిప్రాయసేకరణ చేపడతాడు



తాపస
మునీశ్వరుడి వేషంలో తిరుగుతూ ప్రజల గౌరవాన్ని పొందుతూ విషయ సేకరణ చేస్తాడు



Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

వీటిని దానమిస్తే రాహు ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు

View next story