తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా 'సార్'. తమిళంలో 'వాతి'గా విడుదలైంది. 'సార్' నిర్మాతల్లో త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ఒకరు. ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ ను త్రివిక్రమ్ ఆకాశానికి ఎత్తేశారు. ఈతరం గొప్ప నటులలో ధనుష్ ఒకరని త్రివిక్రమ్ తెలిపారు. తొలి తరం తమిళ హీరోలతో ఆయన్ను పోల్చారు. త్రివిక్రమ్ తన గురించి ఎంత గొప్పగా చెప్పినా సరే... ధనుష్ మాత్రం వినమ్రంగా మాట్లాడారు. 'సార్' దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పారు. మంచి భావోద్వేగాలతో కూడిన సింపుల్ సినిమా తీశామని ధనుష్ మాట్లాడారు. 'సార్'లో తన నటన చాలా సింపుల్ గా ఉంటుందని... సినిమా మాత్రం గొప్పగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తాము అర్థవంతమైన సినిమా చేశామని, ప్రేక్షకులు సినిమాతో కనెక్ట్ అవుతారని ధనుష్ వివరించారు. 'సార్' సినిమా ప్రారంభం నుంచి త్రివిక్రమ్ అందిస్తున్న మద్దతుకు ధనుష్ థాంక్స్ చెప్పారు. సాయి కుమార్ ఇంటి నుంచి ప్రతిరోజూ భోజనం వచ్చేదని... ఆయన అతిథి మర్యాదలు మరువలేనని ధనుష్ అన్నారు. 'సార్' ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ ఫోటోలు