ధనుష్ 'సార్'లో కథానాయికగా సంయుక్త నటించారు. 'భీమ్లా నాయక్' తర్వాత సితార సంస్థలో ఆమె రెండో చిత్రమిది. 

'భీమ్లా నాయక్'లో తన నటన నచ్చి 'సార్' సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చారని సంయుక్త తెలిపారు. 

దర్శకుడు వెంకీ అట్లూరి కథ చెప్పినప్పుడు విపరీతంగా నచ్చిందని, వెంటనే సినిమా చేసేయాలని డిసైడ్ అయ్యారట.

'సార్' సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించానని సంయుక్తా మీనన్ తెలిపారు. 

ఏపీ, తెలంగాణలో పల్లెటూరి అమ్మాయిలు ఎలా ఉంటారనేది తెలుసుకోవడం కోసం కొన్ని గ్రామాలు తిరిగానని సంయుక్త తెలిపారు.

తెలుగు అమ్మాయిల చీరకట్టు, మాట తీరు ఎలా ఉంటుందనేది గమనించానని సంయుక్త పేర్కొన్నారు. 

తాను ధనుష్ నటనకు అభిమాని అని, అటువంటి పెద్ద స్టార్ తో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు సంయుక్త.

'సార్'లో బయాలజీ టీచర్ మీనాక్షి పాత్రలో సంయుక్త చెప్పారు. 

'సార్'లో విద్యావ్యవస్థ గురించి సందేశంతో పాటు వినోదం కూడా ఉందన్నారు.