నిమ్మ చెక్కలను ఇన్ని రకాలుగా వాడుకోవచ్చా? నిమ్మకాయలనుంచి రసం పిండుకున్న తరవాత, వాటి తొక్కలను పడేస్తూ ఉంటాం. నిమ్మకాయ తొక్కలను పడేసేబదులు దానిని చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. చేతులకు జిడ్డు అంటినప్పుడు నిమ్మ చెక్కతో రుద్దితే జిడ్డు తొలగిపోతుంది. బట్టలకు మరకలు పడ్డప్పుడు నిమ్మ చెక్కతో రుద్దితే మరక ఇట్టే పోతుంది. మురికిగా ఉన్న వంటింటి సింక్‌ని నిమ్మ చెక్కతో శుభ్రం చేయవచ్చు. నిమ్మ చెక్కతో ఇత్తడి సామాగ్రిని తోమితే మంచి మెరుపు వస్తుంది. షూస్‌లో నిమ్మచెక్క పెడితే వాటినుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. వెనీగర్ , నిమ్మ తొక్కలను నీళ్లలో కలిపి, ఇంటిలోని అద్దాలను తుడుచుకోవడానికి వాడచ్చు.