సన్‌స్క్రీన్​ని ఎందుకు వాడాలి? దాని ప్రయోజనాలు ఏంటి?

సన్‌స్క్రీన్ క్రీమ్ సూర్య కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

అంతే కాకుండా అకాల వృద్ధాప్యం, ముడతలు వంటి చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది.

చర్మ క్యాన్సర్, ఇతర చర్మ సంబంధిత సమస్యలను నివారించడానికి, సన్‌స్క్రీన్‌ను ఉపయోగించొచ్చు.

సన్‌స్క్రీన్ వాడకం చర్మ సమస్యల నుంచి సమగ్ర రక్షణను అందించి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

సన్‌స్క్రీన్ కొల్లాజెన్, కెరాటిన్, ఎలాస్టిన్ వంటి ముఖ్యమైన చర్మ ప్రోటీన్‌లను రక్షిస్తుంది.

సన్ బర్న్ వల్ల చర్మం ఎర్రగా మారుతుంది, దాని నుంచి రక్షణకు సన్‌స్క్రీన్ అవసరం.

సన్‌స్క్రీన్‌ని కొనుగోలు చేసే ముందు 30 కంటే ఎక్కువ SPF కలిగి ఉండేదాన్ని ఎంచుకోండి.

మినరల్ కంటెంట్ ఉన్న సన్‌స్క్రీన్‌ను ఉపయోగిస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.