ఈరోజుల్లో యువత రకరకాల వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలతో పిల్లలు కనడాన్ని వాయిదా వేస్తున్నారు.

ఒక వయసు తర్వాత అండల నాణ్యత తగ్గి సంతాన సాఫల్య సమస్యలు రావచ్చు.

ఇలాంటి వారి పాలిట వరం వంటిది ఓసైట్ క్రయోప్రిజర్వేషన్ పద్ధతి.

ఈ పద్ధతిలో అండాలను ఘనీభవించి భద్రపరచుకునే అవకాశం ఉంది. వీటిని సరైన సమయంలో ఫలధీకరించి తల్లి కావచ్చు.

క్యాన్సర్, ఎండోమెట్రియాసిస్ వంటి తీవ్రమైన అనారోగ్యాలకు చికిత్స తీసుకుంటున్న వారి పాలిట వరం వంటిది ఈ ప్రక్రియ.

అయితే దీనిలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.



అండాలు భద్రపరిచినంత మాత్రాన తర్వాత కాలంలో వాటి నుంచి తప్పకుండా గర్భం దాల్చుతారన్న గ్యారెంటీ ఉండదు.

అండాలు ఫ్రీజ్ చేసిన సమయంలో వయసు ఎంత అనేది అన్నింటికంటే ఎక్కువ ప్రభావం చూపే విషయం.

ఫలధీకరణ జరిగిన తర్వాత ఇంప్లాంటేషన్ సమయంలో గర్భాశయ ఆరోగ్యం కూడా ముఖ్యమే.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels