తేనెతో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా.. చర్మ, జుట్టు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. మీరు చర్మానికి మంచి ప్రయోజనాలు పొందాలనుకుంటే తేనెను ఇలా ఉపయోగించండి. పెరుగులో తేనెను కలిపి ముఖానికి మాస్క్‌లాగా అప్లై చేయవచ్చు. అలోవెరా జెల్లో తేనెను కలిపి దానిని అప్లై చేస్తే పొడిచర్మం దూరమవుతుంది. వేడి నీళ్లలో తేనెను కలిపి స్నానం చేసినా మంచి ఫలితాలు పొందొచ్చు. ఓట్స్‌లో తేనెను కలిపి మొత్తం శరీరానికి స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు. అరటిపండు గుజ్జులో తేనె కలిపి అప్లై చేస్తే చాలా మృదువైన స్కిన్ మీ సొంతమవుతుంది. శెనగపిండిలో తేనెను కలిపి అప్లై చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. (Images Source : Unsplash)