విక్కీ కౌశల్ నటించిన ‘ఉరి’ సినిమాని మణిపూర్‌లో ప్రదర్శించారు.

2000 సంవత్సరంలో మణిపూర్‌లో బాలీవుడ్ సినిమాలని బ్యాన్ చేశారు.

1998లో వచ్చిన ‘కుచ్ కుచ్ హోతా హై’ మణిపూర్‌లో ప్రదర్శితమైన చివరి బాలీవుడ్ సినిమా.

ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత మళ్లీ బాలీవుడ్ సినిమాను ప్రదర్శించారు.

ఆగస్టు 15వ తేదీ సాయంత్రం ఈ సినిమాను ప్రదర్శించారు.

మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌లోని రెంగ్‌కాయ్ ప్రాంతంలో ‘ఉరి’ సినిమాను చిత్రీకరించారు.

కుకి తెగకు చెందిన వారు ఈ సినిమాను ప్రదర్శించారు.

ఓపెన్ థియేటర్‌లో ఈ సినిమా ప్రదర్శితం అయింది.

హిందీ సినిమాల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ‘ఉరి’ సినిమాను ప్రదర్శించారు.

2019లో వచ్చిన ‘ఉరి’ చాలా పెద్ద హిట్ అయింది.