వెరైటీ దుస్తులను ధరించి ఎప్పుడూ వార్తల్లో ఉండే సెలబ్రిటీ ఉర్ఫీ జావెద్. ఛాన్సు దొరికితే.. చెత్త కుప్పను కూడా డ్రెస్‌గా ధరించే సత్తా ఆమెది. ఇటీవల గోనె సంచి డ్రెస్ ధరించి అందరినీ నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది ఉర్ఫీ. కొద్ది రోజుల కిందట టాప్ లేకుండా కేవలం పువ్వులను మాత్రమే ధరించింది. తాజాగా ఆమె.. బ్లేడ్‌లతో తయారు చేసిన డ్రెస్ ధరించింది. ఔనండి, నిజమే ఇదిగో వీడియో. చూశారుగా ఒళ్లంతా బ్లేడ్‌లతో ఎలా నింపేసుకుందో! సాధారణంగా జేబు దొంగలను బ్లేడ్ బాబ్జీలని అంటారు. మరి ఒళ్లంతా బ్లేడ్‌లతో కప్పేసుకున్న ఉర్ఫీని మనం ‘బ్లేడ్ బేబీ’ అనడమే కరెక్ట్. ఉర్ఫీ తన డ్రెస్‌లను తానే డిజైన్ చేసుకుంటుంది. ఇందుకు ప్రత్యేకంగా ఒక టీమ్ కూడా ఉంది. Images and Videos Credit: Urfi Javed/Instagram