సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ క్రేజ్ పెంచుకుంటున్న నటి సురేఖా వాణి. సురేఖ, ఆమె కూతురు సుప్రిత కలిసి చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఎన్ని విమర్శలు వచ్చినా తల్లీకూతుళ్లు లెక్కే చేయరు. గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో ఇద్దరూ అందాలను ఆరబోస్తుంటారు. సురేఖ ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘మొగుడ్స్ పెళ్లామ్స్’కు సురేఖ భర్త సురేష్ తేజ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. సహాయ నటిగా బిజీగా ఉన్న సమయంలో సురేఖ తన భర్తను కోల్పోయారు. సురేఖ ఇటీవల విడుదలైన ‘షికారు’ మూవీలో నటించారు. సురేఖ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా సురేఖ తనకు 5 కిలోల ఆనందం కావాలంటూ రీల్ వీడియో పోస్ట్ చేశారు. మరో రీల్ వీడియోలో ఎక్స్‌ప్రెషన్స్‌తో సురేఖవాణి ఆకట్టుకున్నారు. Images and Videos Credit: Surekhavani/Instagram