తొలి వన్డేలో టీమ్ఇండియా 10 వికెట్ల తేడాతో గెలిచింది. బుమ్రా 6 వికెట్లతో చెలరేగాడు. షమి 3 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ 110కి ఆలౌటైంది. టీమ్ఇండియాపై ఇంగ్లాండుకు ఇదే అత్యల్ప స్కోరు షమి 150వ వికెట్ అందుకోవడంతో సహచరులు అభినందించారు. ఛేజింగులో హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. గబ్బర్ తో కలిసి 5000 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. 19 ఓవర్లలోపే టీమ్ఇండియా 10 వికెట్లతో గెలిచింది. బుమ్రాకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. రోహిత్ ఫామ్ అందుకోవడంతో ఫ్యాన్స్ ఆనందించారు.