లింగుస్వామి కథ చెప్పినప్పుడే సినిమా ఎలా ఉంటుందో ఊహించా. ఆయన ఫ్లాపుల్లో ఉన్నారని ఆలోచించలేదు. అలా లెక్కలు వేసుకుంటే పూరితో 'ఇస్మార్ట్ శంకర్' చేసేవాడిని కాదు. వీళ్ళు డైమండ్స్.
మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి గారు ఏమీ మాట్లాడరు. అయితే... ఆయనతో పని చేసిన వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ ఆయనతో సినిమా చేస్తారు. 'ది వారియర్' తర్వాత ఆయన నిర్మాణంలో బోయపాటి సినిమా చేస్తున్నా.
'ది వారియర్' షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు నాకు గాయమైంది. అందువల్ల, మూడు నెలలు వాయిదా వేయాల్సి వచ్చింది.
గాయంతో షూటింగ్ చేయడం అవసరమా? అని కొందరు అడిగారు. సెట్‌లో కెమెరా లెన్స్ చూస్తే... నాకు పదికోట్ల మంది ప్రేక్షకులు కనిపిస్తారు. వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడతా!
'ది వారియర్'కు ముందు పోలీస్ కథలు 4,5 విన్నా. అన్నీ రొటీన్‌గా ఉన్నాయి. పోలీస్ కథ వద్దనుకున్న టైమ్‌లో లింగుస్వామి కథ చెప్పారు.
లింగుస్వామి కథ నన్ను ఎంత ఎగ్జైట్ చేసిందంటే... కథ చెప్పిన సాయంత్రానికి ఇంటికి పోలీస్ యూనిఫామ్ తెప్పించా.
దేవీశ్రీని కూడా కథ ఎగ్జైట్ చేసింది. లింగుస్వామి కథ చెప్పి వెళ్ళాక... నాకు ఫోన్ చేసి పాటలు, నేపథ్య సంగీతం ఎలా ఉంటుందో వివరించాడు.
పోలీస్, విలన్... ప్రతి కథలో ఉంటారు. అయితే... 'ది వారియర్'లో హీరో ఎందుకు పోలీస్ అయ్యాడు? తర్వాత ఏం చేశాడు? అనేది మెయిన్.
రియల్ పోలీస్ ఆఫీసర్స్ స్ఫూర్తితో లింగుస్వామి 'ది వారియర్' కథ రాశారు. ప్రతి ఒక్కరికీ సినిమాలో ఎమోషన్ కనెక్ట్ అవుతుంది.
సాంగ్స్ విషయంలో దేవిశ్రీ చాలా కేర్ తీసుకున్నారు. థియేటర్ కోసం స్పెషల్ గా డిజైన్ చేశాడు.
ఇంతకు ముందు కోలీవుడ్ నుంచి కొన్ని కథలు వచ్చాయి. తెలుగులో ఆడవేమో అని వాటిని చేయలేదు. లింగుస్వామి కథ తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ఉంది.
నేను చెన్నైలో పెరగడం వల్ల తమిళ్ వచ్చు. అందుకని, ఈజీగా డబ్బింగ్ చెప్పా. డిక్షన్, పర్ఫెక్షన్ చూసి లింగుస్వామి సర్‌ప్రైజ్ అయ్యారు.
కృతి శెట్టికి వర్క్ మీద చాలా అంకితభావం, గౌరవం ఉన్నాయి. మనం చేసే పని మీద మనకు గౌరవం ఉంటే మిగతావన్నీ సెట్ అవుతాయి.