గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా చెప్పండి



లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక.. ఇలా ఏ రంగంలో అయినా మనలను నడిపించడానికి గురువు కావాలి. అలాంటి గురువులను స్మరించుకునే రోజే గురు పౌర్ణమి.



1. గురు ప్రార్ధన
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే!
నమోవై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమః!!



2. ​గురువు విశిష్టత
గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ:



3.‘న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః’
అంటే గురువును మించిన తత్వం, తపస్సు, జ్ఞానం వేరొకటి లేవు అని అర్ధం.



4. గుకారశ్చాంధకారస్తు రుకార్తన్నిరోధకృత్‌
‘గు’ అంటే చీకటి.. ‘రు’ అంటే దానిని అడ్డగించువాడు. అజ్ఞానమనే చీకటిని తొలిగించే శక్తే గురువు.



5. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవేనమః
అజ్ఞానమనే చీకటితో అంధులైనవారికి జ్ఞానమనే అంజనాన్ని పూసి, కన్నులు తెరిపించిన గురువుకు నమస్కారం అని దీని భావం.



6. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ||
అఖండ ప్రపంచాన్ని ఆకాశం లా వ్యాపించిన ఏ గురుతత్వమైతే 'తత్ 'అని పిలువబడే బ్రహ్మను దర్శింపజేసిందో,అట్టి శ్రీ గురువుకు నమస్కారము.



విద్యార్థి నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడే ఉపాధ్యాయుడు ప్రత్యక్షమవుతాడు. మనలో నేర్చుకోవాలనే కుతూహలం కలిగితే చాలు.. తనకు వచ్చిన విజ్ఞానాన్నంతా నేర్పడానికి గురువు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. -గౌతమ బుద్ధుడు



స్వపరభేదం లేనివాడు, ఏ భ్రాంతికి లోను కానివాడు, అహంకారాన్ని ఆమడ దూరంలో ఉంచేవాడు, ఏ పరిస్థితుల్లో మనోస్థ్యైర్యం కోల్పోక ఆత్మనిష్ఠతో ఉండేవాడే సద్గురువు. అలాంటి గురువుల బోధన విద్యార్థుల ఉన్నతికి దోహదం చేస్తుంది - రమణ మహర్షి