గూగుల్ ఎక్స్‌ప్లోర్ (Google Explore) ఉపయోగించండి. టిక్కెట్ ధరలు తగ్గితే నోటిఫికేషన్ ఇచ్చే క్రోమ్ ప్లగ్ఇన్స్ (Price drop Chrome plugins) ఇన్‌స్టాల్ చేసుకోండి. పగలు పూట తిరిగే విమానాలను ఎంపిక చేసుకోండి. ఫ్లైట్ టికెట్ ధరలను డేట్ మార్చి, మార్చి చెక్ చేయండి. బ్యాంకులు ప్రత్యేకంగా అందించే ట్రావెల్ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించండి. ఎయిర్‌లైన్ లాయల్టీ పాయింట్స్, ప్రోగ్రామ్స్‌ను ఉపయోగించండి. సోషల్ మీడియాలో విమానయాన కంపెనీలను ఫాలో అయితే ఆఫర్స్ ఉన్నప్పుడు తెలుస్తుంది. ప్రైవేట్ బ్రౌజింగ్ లేదా ఇంకోగ్నిటో బ్రౌజింగ్ ద్వారా ఫ్లైట్ టికెట్ల కోసం సెర్చ్ చేయండి.