ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు. తన కిల్లర్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ కట్టిపడేస్తుంది. హీరోలకు పోటీగా డాన్స్ చేస్తూ యూత్ ని ఫిదా చేసింది. ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించేసింది సాయి పల్లవి. కమర్షియల్ సినిమాలకు దూరంగా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ కథలనే ఎన్నుకుంటుంది. ఇటీవల 'విరాటపర్వం' సినిమాతో ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఈమె నటించిన 'గార్గి' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సీరియస్ కాన్సెప్ట్ తో నడిచే ఈ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తుంది సాయి పల్లవి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చీర కట్టుకొని ఇంటర్వ్యూలో పాల్గొంది. ట్రెడిషనల్ లుక్ లో ఆమె ఎంతో అందంగా కనిపిస్తోంది. 'గార్గి' ప్రమోషన్స్ లో సాయి పల్లవి