రామ్, కృతి జంటగా నటించిన 'ది వారియర్' జూలై 14న రిలీజ్ అవుతోంది. ఆదివారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. రామ్ సరసన నటించిన హీరోయిన్ల గురించి కృతి వివరించగా... రామ్ వాళ్ళ పేర్లు చెప్పారు. డ్యాన్సర్లు రామ్, కృతిని స్టేజి మీదకు తీసుకువెళ్లగా... హీరో హీరోయిన్లు 'బుల్లెట్...' సాంగ్ హుక్ స్టెప్ వేశారు. 'బుల్లెట్...' పాటకు బ్రహ్మాజీ కూడా స్టెప్ వేయడం విశేషం. రామ్ తనకు ఎంతో మద్దతు ఇచ్చారని, ఆయనతో 10 సినిమాలు చేయాలనుందని లింగుస్వామి చెప్పారు. 'వారియర్ 2' అనౌన్స్ చేశారు. 'రన్' తర్వాత తనతో సినిమా చేస్తానని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి వచ్చారని, ఇప్పటికి తమ కాంబినేషన్ కుదిరిందని లింగుస్వామి తెలిపారు. 'ది వారియర్' కంటే ముందు ఐదు పోలీస్ కథలు రిజెక్ట్ చేశానని... లింగుస్వామి కథ విన్నాక, చేస్తే ఇటువంటి పోలీస్ కథ చేయాలనిపించిందని రామ్ చెప్పారు. యాంకర్ సుమను మిస్ అవుతున్నాని అంటూ బ్రహ్మాజీ కాసేపు నవ్వులు పూయించారు. 'ది వారియర్' ప్రీ రిలీజ్‌కు అతిథిగా హాజరైన హరీష్ శంకర్... రామ్‌తో సినిమా చేయనున్నట్టు చెప్పారు. 'ది వారియర్' ప్రీ రిలీజ్ వేడుకకు సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.