వాస్తు: చనిపోయిన వారి ఫొటోలు ఇటువైపు పెడితే ఇంట్లో సమస్యలు వెంటాడతాయి
చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం, వారి జ్ఞాపకార్థం ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటారు. అయితే చనిపోయిన వారి ఫోటోలను ఎక్కడపడితే అక్కడ పెట్టుకోవడం మంచిదికాదంటోంది వాస్తుశాస్త్రం.
చనిపోయిన వారి ఫొటోలు పెట్టేందుకు కూడా వాస్తు ఫాలో అవుతారు.. లేదంటే ఆ ఇంట సుఖ శాంతులు, సంతోషం హరించుకుపోతుందని వాస్తుపండితులు చెబుతారు.
చనిపోయిన వారి ఫొటోలు దేవుడి మందిరంలో పెట్టకూడదు, ఇలా చేస్తే ఆ ఇంట సమస్యలు పెరుగుతాయి
బెడ్ రూమ్, డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు వెంటాడతాయి
చనిపోయిన వారి ఫొటోల పక్కన బతికుండే వారి ఫొటోలు ఉండకుండా చూసుకోవాలి. కాదు కూడదు అంటే ఆ ప్రభావం బతికున్న వారి ఆయుష్షుపై పడుతుందట
ఇంతకీ చనిపోయిన వారి ఫొటోలు ఎక్కడపెట్టాలంటే కేవలం దక్షిణం వైపున్న గోడకు మాత్రమే. ఎందుకంటే దక్షిణ దిక్కు యముడి స్థానం. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లో అకాల మరణాలు సంభవించవని, కుటుంబ సభ్యులు ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారని అంటారు.
దక్షిణంవైపు గోడకు చనిపోయిన వారి ఫొటోలు వేలాడదీసినట్టే..వాటికి ఎదురుగా ఉత్తరం వైపు గోడకు ఆంజనేయుడి ఫొటో పెడితే ఇంకా మంచిదంటారు.
చనిపోయిన వారి ఫొటోలు ఇంట్లో పెట్టుకోవడం, నిత్యం వారిని స్మరించుకోవడం వల్ల ఆ వారి ఆశీశ్సులు ఉంటాయని భావిస్తారు. అందుకే ఫ్రేమ్ కట్టించి ఇంట్లో గోడకు తగిలిస్తారు.
ఇంట్లో ఉంటే చాలుకదా అని ఎక్కడంటే అక్కడ పెడితే అనుకూల ప్రభావం మాటేమో కానీ ప్రతికూల ప్రభావం ఆ ఇంటిపై పడుతుందంటారు.
నోట్: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.