ఉస్తాద్ రామ్ హీరోగా శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన 'ది వారియర్' జూలై 14న థియేటర్లలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గార్గి' జూలై 15న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేటర్లలోకి వస్తోంది. జీనీగా ప్రభుదేవా నటించిన 'మై డియర్ భూతం' తమిళ, తెలుగు భాషల్లో జూలై 15న విడుదల... థియేటర్లలో! కీర్తీ సురేష్, టోవినో థామస్ నటించిన 'వాషి' దక్షిణాది భాషల్లో జూలై 17న నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్టుగా విడుదల. తెలుగు 'హిట్'కు రీమేక్‌గా రూపొందిన హిందీ 'హిట్' విడుదల కూడా జూలై 15నే! తాప్సీ ప్రధాన పాత్ర పోషించిన మిథాలీ రాజ్ బయోపిక్ 'శభాష్ మిథు' జూలై 15న థియేటర్లలో విడుదలవుతోంది. సుశాంత్, ప్రియా ఆనంద్ జంటగా నటించిన 'మా నీళ్ల ట్యాంక్' వెబ్ సిరీస్ జూలై 15 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూలై 15 నుంచి 'శూర్‌వీర్' విడుదలవుతోంది. ఇందులో రెజీనా మెయిన్ రోల్ చేశారు. 'ఆహా' ఓటీటీలో జూలై 15న కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరిల 'సమ్మతమే' విడుదల. నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 14న 'కుంగ్ ఫు పాండా: ది డ్రాగన్ నైట్' వెబ్ సిరీస్ విడుదల. జీ 5లో జూలై 15న నుష్రత్ బరూచా నటించిన హిందీ సినిమా 'జన్‌హిత్ మేరీ జాన్' విడుదల నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 14న హిందీ సినిమా 'జాదూగర్' విడుదల అవుతోంది.