చికెన్ దోశ చేసేయండిలా...

దోశ పిండి - ఒక కప్పు
చికెన్ ముక్కలు - అరకప్పు
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూను
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
మిరియాల పొడి - పావు టీస్పూను
కారం - అర టీస్పూను

దోశ పిండి - ఒక కప్పు
చికెన్ ముక్కలు - అరకప్పు
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూను
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
మిరియాల పొడి - పావు టీస్పూను
కారం - అర టీస్పూను

కళాయిలో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా ప్యూరీ, కరివేపాకులు వేసి వేయించాలి.

అన్నీ వేగాక కారం, గరం మసాలా, కొత్తి మీర తరుగు, ఉప్పు వేసి వేయించాలి.

అన్నీ వేగాక చిన్నగా తరుక్కున్న చికెన్ ముక్కలు వేసి బాగా ఉడికించాలి.

చికెన్ మిశ్రమం కూరలా చిక్కగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.

పెనంపై దోశె వేసుకుని ఈ చికెన్ కూరను వేసి దోశంతా పరవాలి.

అంతే చికెన్ దోశ రెడీ అయినట్టే. చట్నీ ఏదీ అవసరం లేకుండానే దీన్ని తినవచ్చు.