అతిగా చీజ్ తింటే వచ్చే సమస్యలు ఇవే



చీజ్ వాడకం ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది.

చీజ్ పిజ్జా, చీజ్ బర్గర్, చీజ్ బాల్స్... అంటూ రకరకాల ఆహారాలు తినడం అధికమైంది.

చీజ్ లో బోవిన్, గ్రోత్ హార్మోన్ వంటి కృత్రిమ పదార్థాలు ఉంటాయి. ఇవి అధికంగా శరీరంలో చేరడం వల్ల ఆరోగ్యానికి హానికరం.

చీజ్ ఉండే పదార్థాలు అధిక సోడియాన్ని కలిగి ఉంటాయి. దీనివల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది.

చీజ్ అతిగా తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.

కొలెస్ట్రాల్ అతిగా శరీరంలో పేరుకుపోతుంది.

బరువును కూడా అధికంగా పెరిగేలా చేస్తుంది.

చీజ్ ను చాలా తక్కువ తినడం మంచిది.