కేజీయఫ్‌ను మించిన అతి పెద్ద బంగారు గని కేజీయఫ్ సినిమాను చూశారు కదా, అంతకుమించి అతి పెద్ద బంగారు గని ఉంది. అమెరికాలోని నెవడా ప్రాంతంలో అతి పెద్ద గోల్డ్ మైన్ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. ఇక్కడ్నించి ప్రతి ఏడాది లక్షల కిలోల బంగారాన్ని తీస్తారు. వీటి విలువ కొన్ని వందల కోట్లు ఉంటుంది. ఒక అంచనా ప్రకారం ఏటా లక్షా 70 వేల కిలోలు బంగారాన్ని తీస్తారు. ఒక్క 2018లోనే 176 టన్నులు వెలికితీశారంట. 1870లో ఈ బంగారు గనిని కనిపెట్టారు.చాలా చిన్న ప్రాంతంలోనే ఈ గని ఉందనుకున్నారు. 1900 సంవత్సరం దాటాకా మాత్రం ఈ గని అనుకున్నంత చిన్నది కాదని, భూమిలో సువర్ణాన్ని భారీగా దాచుకుందని తేలింది. దాదాపు 7000 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు.