2007లో 'దేశముదురు' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది హన్సిక. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ఎంత వేగంగా స్టార్ డం అందుకుందో.. అంతే వేగంగా టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయింది. అదే సమయంలో ఆమెకి తమిళనాట అవకాశాలు వచ్చాయి. బొద్దుగా ఉండే హీరోయిన్స్ ను ఇష్టపడే తమిళ ప్రేక్షకులు హన్సికను నెత్తిన పెట్టుకున్నారు. చిన్న ఖుష్బూ అంటూ ఆమెకి పేరు పెట్టేసుకొని.. ఏకంగా గుడి కూడా కట్టేశారు. తెలుగు ప్రేక్షకులు ఆమెని మర్చిపోయినప్పటికీ తమిళంలో మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. పెద్ద హీరోల సరసన అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో అంతగా మార్కెట్ లేని హీరోల సరసన నటిస్తోంది. అలానే తనే ప్రధానంగా నటిస్తోన్న కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.