సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ కు ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ వెళ్లిన ఉర్ఫీ జావేద్... ఎయిర్ పోర్టుకు చేరుకోవడానికి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. హోటల్ నుంచి బయలు దేరిన తర్వాత మధ్యలో లంచ్ చేయడం కోసం ఆగారు. భోజనం చేశాక వచ్చి చూస్తే... దిగిన చోట క్యాబ్ లేదు. క్యాబ్ డ్రైవర్ కి కాల్ చేస్తే మొదటి లిఫ్ట్ చేయలేదట. చాలాసార్లు కాల్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసిన డ్రైవర్ తాగి మాట్లాడాడని ఉర్ఫీ జావేద్ పేర్కొన్నారు. డ్రైవర్ సరిగా రెస్పాండ్ కాకపోవడంతో ఉర్ఫీ జావేద్ తన స్నేహితులతో ఒక అబ్బాయికి ఈ విషయం చెప్పారు. తన మేల్ ఫ్రెండ్ డ్రైవర్ కి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత అతడు మళ్ళీ వచ్చాడని ఉర్ఫీ జావేద్ పేర్కొన్నారు. డ్రైవర్స్ ఇలా మందు తాగితే మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఉర్ఫీ జావేద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గంటలకు రెంటల్ సిస్టమ్ లో క్యాబ్ బుక్ చేసుకున్నానని, తనకు ఈ విధంగా జరుగుతుందని అనుకోలేదని ఆమె చెప్పారు. (Image Courtesy : Manav Manglani)