తారకరత్న 40 ఏళ్ళు నిండకుండా మరణించారు. యంగ్ ఏజ్‌లో చనిపోయిన హీరోలు ఇంకెవరు ఉన్నారో చూడండి. ఉదయ్ కిరణ్ మరణం టాలీవుడ్‌కు షాక్ ఇచ్చింది. ఆయన 33 ఏళ్ళ వయసులో సూసైడ్ చేసుకున్నారు. హిందీ హీరో, 34 ఏళ్ళ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఎంత సంచలనమైందో తెలిసిందే. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (46 ఏళ్ళు) గుండెపోటుతో గత ఏడాది మరణించారు. 'కుందనపు బొమ్మ'లో ఓ హీరోగా నటించిన సుధీర్ ఈ ఏడాది జనవరి 10న ఆత్మహత్య చేసుకున్నారు. 'ఉల్లాసంగా ఉత్సాహంగా' హీరో యశో సాగర్ చిన్న వయసులో కారు ప్రమాదంలో కన్ను మూశారు. తెలుగులో హాస్యనటుడిగా కొన్ని సినిమాలు చేసిన విజయ్ ఆత్మహత్య చేసుకున్నారు. 'ఇష్టంగా'లో హీరోగా నటించిన, నాగార్జున మేనకోడలు సుప్రియను పెళ్లి చేసుకున్న చరణ్ రెడ్డి క్యాన్సర్ కారణంగా చిన్న వయసులో మరణించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న సమయంలో శ్రీహరి మరణించారు. హాస్య నటుడిగా ఎంతో భవిష్యత్ ఉన్న వేణుమాధవ్ మరణం కూడా టాలీవుడ్‌కు షాక్.