ప్రస్తుతం మనదేశంలో యూపీఐ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ ఎక్కువ అయిపోయాయి. ప్రతి నెలా కొన్ని కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. దీంతో పాటే యూపీఐ ఆధారంగా జరిగే స్కామ్‌ల కారణంగా ప్రజలు తమ నగదును కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇలాంటి మోసాలు జరగకుండా అడ్డుకోవచ్చు. యూపీఐ ద్వారా పేమెంట్ చేసేటప్పుడు ఎవరికి పంపిస్తున్నాం అనేది ఒకటికి రెండు సార్లు చూసుకోండి. యూపీఐ పిన్‌ను ఎటువంటి పేజీల్లో ఎంటర్ చేయకండి. కేవలం పిన్ పేజీల్లో మాత్రమే ఎంటర్ చేయాలి. మీ ఖాతాకు డబ్బు రావాలంటే పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. పిన్ ఎంటర్ చేస్తే మీ ఖాతా నుంచి నగదు కట్ అవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. లావాదేవీ పూర్తి చేశాక వచ్చే మెసేజ్‌ను కూడా చూసి ఎంత కట్ అయిందో క్రాస్ చెక్ చేసుకోండి.