శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ భారతదేశంలో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్24, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్లు వచ్చాయి. ఈ మూడు స్మార్ట్ ఫోన్లూ భారతదేశంలో త్వరలో సేల్‌కు రానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించారు. మిగతా రెండూ మోడల్స్‌లోనూ క్వాల్‌కాం చిప్ లేదా శాంసంగ్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్ అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ధర రూ.79,999 నుంచి ప్రారంభం కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్ ప్రారంభ వేరియంట్ ధర రూ.99,999గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ధర రూ.1,29,999 నుంచి స్టార్ట్ కానుంది. వీటి సేల్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.