ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందించారు. దీనిపై ఏకంగా రూ.17 వేల వరకు తగ్గింపు అందించారు. ఐఫోన్ 15 మనదేశంలో రూ.79,900 ధరతో లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా దీని ధర రూ.65,999కు తగ్గింది. బ్యాంక్ ఆఫర్లు కూడా అప్లై చేస్తే రూ.62,999కు తగ్గనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఏ16 బయోనిక్ చిప్, డైనమిక్ ఐల్యాండ్, 48 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. గతేడాది ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో ఈ ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు స్టాండర్ట్ వేరియంట్‌లో కూడా అందుబాటులోకి తెచ్చారు. 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. 5జీని కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.