మనదేశంలో సైబర్ క్రైమ్‌లు రోజురోజుకూ పెరిగిపోతూ ఉన్నాయి. కొంతమంది ఇతరుల పేర్ల మీద ఉన్న సిమ్ కార్డులు తీసుకుని వాడుతున్నారు. మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ‘సంచార్ సాతీ’ అనే ప్లాట్‌ఫాం క్రియేట్ చేసింది. ఈ పోర్టల్‌లో మీ పేరు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీని కోసం యూజర్లు ‘https://tafcop.sancharsaathi.gov.in/’ వెబ్ సైట్‌కు వెళ్లాలి. దాని తర్వాత వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. అనంతరం మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఇవ్వాలి. అక్కడ కనిపించే సిమ్ కార్డుల్లో మీరు ఉపయోగించనివి ఉంటే బ్లాక్ చేయవచ్చు.