క్రిస్మస్ ఏ దేశంలో ఏంటి స్పెషల్!



స్లోవాకియాలో క్రిస్మస్‌ రోజు ఇంటి ఎంట్రన్స్ కి వెనక్కు తిరిగి నిల్చుని చెప్పు తీసి విసురుతారు. ఆ చెప్పు ఇంటి ముందు సరిగ్గా పడిందంటే త్వరలో పెళ్లవుతుందని విశ్వాసం



జపాన్ లో క్రిస్మస్ సందర్భంగా చికెన్ అమ్మకాలు మామూలు రోజులకన్నా పదిరెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత రోజు ఎవ్వరూ కొనరు, ఇంట్లో ఉండిపోయినవి కూడా తినరు.



ఫిన్లాండ్‌లో క్రిస్మస్‌ ముందురోజు సాయంత్రం స్మశానాలకి వెళ్లి వారి ఆత్మీయులను తలచుకుంటూ వారి సమాధులపై కొవ్వొత్తులు వెలిగిస్తారు.



ఫిన్లాండ్ లో క్రిస్మస్ రోజు వంట చేసి అవన్నీ బల్లపై పెట్టేసి..మంచాలు సిద్ధం చేసి ఇంట్లో వాళ్లంతా నేలపై పడుకుంటారు. గతించిన వారు వచ్చి తినేసి పడుకుంటారని విశ్వాసం



స్వీడన్ వీధుల్లో భారీ మేక బొమ్మను నిలబెడతారు. క్రిస్మస్‌ ఈవ్‌ అర్ధరాత్రి ఆ మేకను కాల్చేస్తారు. ఈ సాంప్రదాయం 1966లో మొదలయ్యింది.



మామూలుగా అయితే క్రిస్మస్‌ ట్రీకి అందమైన దీపాలు, గంటలు, బొమ్మలు వేలాడదీస్తారు. కానీ ఉక్రెయిన్‌లో ఆ చెట్టుకు సాలెపురుగు గూళ్లను వేలాడదీస్తారు.



ఇంకా ఒక్కో దేశంలో ఒక్కో పద్ధతి.. కొన్ని కొన్ని దేశాల్లో వింత సంప్రదాయాలు.



ఏవరు ఏం అనుసరించినా ప్రతి పండుగ ఉద్దేశం కుటుంబాల్లో, సమాజంలో సంతోషం నింపాలన్నదే



Image Credit: Pixabay