ఇతిహాసాలన్నీ చదవాల్సిన అవసరం లేదు - ఇదొక్కటీ చదివితే చాలు!



భగవద్గీత ఆవిర్భవించిన రోజైన మార్గశిర శుక్ల ఏకాదశి ( ముక్కోటి ఏకాదశి)ని గీతా జయంతిగా జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబరు 23 గీతాజయంతి



భగవద్గీత పూజించడానికో, పఠించడానికో నిర్దేశించింది మాత్రమే కాదు.. మనిషిగా బతకడానికి కావాల్సిన సూత్రాలు అందించిన గ్రంధం.



మహాభారతంలో భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయాలు భగవద్గీతగా చెబుతారు.



ఒక అధ్యాయాన్ని ఒక యోగం అంటారు. ఆరు యోగాలని కలిపి ఒక షట్కమంటారు.



1 నుంచి 6 అధ్యాయాలను కర్మ షట్కమని, 7 నుంచి 12 వరకు భక్తి షట్కమని, 13 నుంచి 18 వరకు జ్ఞాన షట్కమని అంటారు.



మహా భారతంలో భగవద్గీత ఒక భాగమైనా, భగవద్గీతకు ప్రత్యేక గుర్తింపు ఉంది.



ఒక్క భగవద్గీత ఎన్నో పురాణేతిహాసాలకు సమానం. అంటే అన్నీ ఇతిహాసాలు చదవనక్కరలేదు ఒక్క భగవద్గీత చదివితే చాలు, జీవిత పరమార్ధం తెలుస్తుంది



కర్తవ్య విముఖుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యం వైపు మళ్ళించడమే గీత లక్ష్యం



భావోద్వేగాలు, ఆశాపాశాలు, మాయామోహాలు అడుగు ముందుకు వేయకుండా కళ్లెం వేస్తాయి. అందుకే హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని చెప్పిన తర్వాతే బోధ ప్రారంభించాడు శ్రీ కృష్ణుడు



Images Credit: Pinterest