భగవద్గీత: వైరాగ్యం కోసం కాదు కర్తవ్య నిర్వహణకోసం!



భగవద్గీత శ్లోకాలు వినిపించగానే..అక్కడ ఎవరో చనిపోయి ఉంటారు అందుకే భగవద్గీత పెట్టారనే వారి సంఖ్య ఎక్కువే.



మామూలుగా కూడా భగవద్గీత వింటున్నా అని ఎవరైనా చెప్పినప్పుడు ఎందుకంత వైరాగ్యం అంటారు.



వాస్తవానికి భగవద్గీత అంటే వైరాగ్యం కాదు చేయాల్సిన కార్యాన్ని గుర్తుచేస్తూ కర్తవ్య నిర్వహణను సూచించే ప్రేరకం.



భగవద్గీత అంటే జీవిత చరమాంకంలో కాలక్షేపం కోసం చదివే పుస్తకం కాదు...



రకరకాల ఉద్రేకాల మధ్య కొట్టుకుపోతున్న యువత వాటినుంచి ఎలా బయటపడాలో చెప్పే గ్రంధం.



జీవితంలో ప్రతి మలుపులోనూ ఉపయోగపడుతుంది. ఎదురయ్యే ప్రతిప్రశ్నకీ సమాధానం ఇస్తుంది.



సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత.



కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి.. రాజ్యం కోసం వారిని నేను వధించలేనని బాధపడిన అర్జునుడికి చెప్పిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత.



ఈ పవిత్రగ్రంధ్రం ఆవిర్భవించిన రోజైన మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు Images Credit: Pinterest