తిరుమల ఏడుకొండలు ఎక్కడం వెనుక పరమార్థం ఇదే



1. వృషభాద్రి - అంటే ఎద్దు.
వృషభం అంటే ఎద్దు...శివుడి వాహనం.
వాక్కు అంటే - శబ్దం
శబ్దం అంటే - వేదం
వేదం అంటే - ప్రమాణము
వేదమే ప్రమాణం, వేదం ప్రమాణాన్ని అంగీకరించిన వారు మొదటి కొండ ఎక్కుతారు.



వృషాద్రి - అంటే ధర్మం
ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. భగవంతుడున్నాడని విశ్వశిచినప్పుడు...ఆ దేవుడు ఇచ్చిన జన్మని చెడుకి వినియోగించకుండా ఉండటం. ఆ స్థితిలో దాటేదే వృషాద్రి ఎక్కడం.



3. గరుడాద్రి - అంటే పక్షి- జ్ఞనాన్ని పొందడం
షడ్ చక్రాల విషయానికొస్తే.. షడ్ అంటే జీర్ణం కానిది అని అర్థం. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పుట్టింది, ఉన్నది, పెరిగింది, మార్పు చెందింది, తరిగినది, నశించినది..ఇవననీ పుట్టిన ప్రతి ఒక్కరికీ జరుగుతూ ఉంటాయి. ఈ 6 లేని వాడు భగవానుడు.



4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి కాటుక
కాటుక అందాన్నిస్తుంది..చలవ చేస్తుంది. కంటికి అందం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. చూడవలసినవి చూసినప్పుడు మాత్రమే ఈ కంటికి అందం. ఈ కంటితో చూసినదంతా బ్రహ్మమే అని తెలుసుకోవడం కాటుక.



5. శేషాద్రి
ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసినవారికి రాగద్వేషాలుండవు. క్రోధం, శత్రుత్వం ఉండదని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు. అంటే తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వారికి ఉన్న భయం..అంతా బ్రహ్మమే అనుకునేవారికి ఉండదు.



6. వేంకటాద్రి
వేం అంటే పాపం, కట అంటే తీసేయడం. అంటే పాపాలు తొలగించేది అని అర్థం. అంతా చేయించేది బ్రహ్మమే.. అందుకే బహ్మం తెలిసిన వాళ్లు పిచ్చివాళ్లలా కనిపిస్తారు. అందుకే జ్ఞాని, పిచ్చి వాడు ఒకెలా ఉంటారు.



7. నారాయణాద్రి
అంటే తుల్యావస్థ ని కూడా దాటి, తానే బ్రహ్మముగా నిలబడిపోతారు.