ABP Desam


ఈ రోజు ( మార్చి 10) మీ రాశిఫలితం


ABP Desam


మేషం
మీరు కొత్త వ్యాపారం కోసం రుణం తీసుకోవలసి రావొచ్చు. వేరొకరి పట్ల ఆకర్షణ వైవాహిక సంబంధాలలో ఇబ్బందులను సృష్టిస్తుంది. కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది.


ABP Desam


వృషభం
ఉద్యోగులకు ఈ రోజంతా శుభసమయమే. ఖర్చులు తగ్గించి పొదుపుపై దృష్ట సారించండి. శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఇంటి పనులు పెరుగుతాయి. ఒక వ్యక్తితో అనవసరమైన గొడవలు జరగుతాయి. ఎవరి పనుల్లో జోక్యం చేసుకోకండి.


ABP Desam


మిథునం
ఈ రోజు మీరు శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసిన ఓ తప్పుని తలుచుకుని బాధపడతారు. రహస్య విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. ప్రభుత్వ వ్యవహారాలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేయవద్దు.


ABP Desam


కర్కాటకం
వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు చేస్తారు. కోర్టు కేసుల సమస్య తొలగిపోతుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన మొత్తం చేతికందుతుంది. అధికారులు మీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.


ABP Desam


సింహం
ఆర్థిక పరిస్థితి విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మికత పట్ల మక్కువ ఉంటుంది.
ఆఫీసులో ఎవరితోనూ వివాదం పెట్టుకోవద్దు. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు.


ABP Desam


కన్య
చాలారోజులుగా నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగాలు మారే ఆలోచన చేస్తారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు ఆందోళనకు గురవుతారు. మీ పని విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాదనలు పెట్టుకోవద్దు.


ABP Desam


తులా
మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. రక్తపోటు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఏదో ఒక విషయంలో ఒత్తిడికి లోనవుతారు. ఎవ్పరికీ అప్పు ఇవ్వొద్దు. అడగకుండా సలహాలు ఇవ్వొద్దు.


ABP Desam


వృశ్చికం
అనారోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. పెళ్లికానివారికి వివాహం నిశ్చయమవుతుంది. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. కొన్ని బాధల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రేమించిన వారిపై ప్రేమను ఈరోజు వ్యక్తం చేయండి.



ధనుస్సు
ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు మీ ఆరోగ్యం బాగుంటుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. మీ మాటల మీద సంయమనం పాటించండి.



మకరం
విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. కార్యాలయంలో గొప్ప విజయం సాధించవచ్చు. మీ పనితీరుపట్ల పై అధికారులు అసంతృప్తిగా ఉంటారు. వ్యాపారులు లాభపడతారు.



కుంభం
ఈ రోజు మీ పని ప్రభావితం అవుతుంది. ఎవరితోనైనా గొడవలు జరిగి మీ ప్రశాంతతను కోల్పోతారు. రిస్క్ తో కూడిన పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఎలాంటి బాధలనుంచైనా ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.



మీనం
వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు కుదరొచ్చు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మీ పనితీరుని మెరుగు పర్చేందుకు ప్రయత్నించండి. పనికిరాని పనులకు సమయాన్ని వృథా చేయకండి.